Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, October 25, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 18

ఇన్సూరెన్స్ గురించిన ప్రకటనలలోఇన్సూరెన్స్ ఈజ్ సబ్జెక్ట్…” అని గడగడా ఏదో చెప్తుంటారు.దీని అర్థం ఏమిటి?

ఇన్సూరెన్స్ ఈజ్ సబ్జెక్ట్ మాటర్ ఆఫ్ సోలిటేషన్అంటే ఇన్సూరెన్స్ కావాలని అడిగి ఎవరైనా కొనుక్కోవాలే తప్ప అమ్మకూడదు అని అర్థం.మీ అంతట మీరే కోరి ఇక ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవాలి తప్ప, మీ చేత బలవంతంగా కొనుక్కులే చేయటం చట్టారీత్యా నేరం.మరి ఏజంట్లు ఎందుకు వున్నారు అని మీరు అడగవచ్చు.ఏజంట్లనే కొన్ని కంపెనీలు అడ్వైజర్ అని కూడా అంటారు.అంటే వీళ్ళు మీకు సలహా మాత్రమే ఇవ్వాలి.

పిల్లల చదువుల కొసం, నాలుగు సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎడ్యుకేషన్ ప్లాన్స్ తీసుకున్నాను.నెల నెల చెరి నాలుగు వేలు క్రమం తప్పకుండా కడుతున్నాను.ఇది మంచి ప్లానేనా?

మీరు తీసుకున్నది యూనిట్ లింక్డ్ ఛైల్డ్ ప్లాన్.మీ పిల్లల వయసు, మీరు తీసుకున్న స్కీమ్ లో ఫండ్ లో డబ్బులు పెట్టారు అన్న విషయాల మీద ఎంత డబ్బు ఎప్పుడు వస్తుందో ఊహించవచ్చు.అది అలా పక్కన పెడదాం. స్కీమ్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. మీరు ఇచ్చిన ప్రీమియంలో కొంత డబ్బు ఫండ్ మానేజ్మెంట్ ఛార్జీల కింద, మరి కొంత ప్రీమియం అలకేషన్ ఛార్జీల కింద, ఇంకొంత పాలసీ అడ్మినిష్ట్రేషన్ ఛార్జీల కింద తగ్గించబడతాయి. ఇక మిగిలిన డబ్బులో మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అవసరమైన డబ్బు (మోర్టాలిటీ ఛార్జ్) తీసుకుంటారు (ఎందుకంటే మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి).ఇవన్నీ పోగా మిగిలిన డబ్బు మీరు కోరుకున్న ఫండ్ లో పెట్టుబడి పెడతారు.మీకు పాలసీ అమ్మిన వ్యక్తి అతి జాగ్రత్తకు మీ చేత బాలన్స్ ఫండ్ లోనే డబ్బులు పెట్టించి వుంటే మీకు వచ్చే రిటర్స్ పిల్లల చదువులకు ఎంత మాత్రమూ సరిపోవు.మీరు వెంటనే మీ ఫండ్ మొత్తాన్ని ఈక్విటీ ఫండ్ లోకి మార్చుకోండి.ఇంకో సంవత్సరంలో మీ లాకిన్ పిరియడ్ అయిపోతుంది.అప్పటిదాకా ప్రీమియం కట్టి, తరువాత డబ్బుని ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి.

బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే డబ్బులు సురక్షితంగా వున్నట్లేనా?ఒక వేళ బ్యాంక్ మూసేస్తే?

చాలామంది బ్యాంక్ డిపాజిట్ చేసి తమ డబ్బు సురక్షితంగా వుందని నమ్ముతారు.పైగా ఈక్వీటీ ఇన్వస్ట్మెంట్ చెయ్యకపోవడానికి ఇది ఒక కారణంగా చెప్తారు.నిజానికి బ్యాంక్ డిపాజిట్ కూడా సురక్షితం కాదు.అనుకోని సందర్భంలో బ్యాంక్ మూసేస్తే, డిపాజిట్ డబ్బులు పోయినట్లే.అయితే, బ్యాంక్ అంత త్వరగా మూతపడదన్న నమ్మకం వల్ల మనం డిపాజిట్ చేస్తాము.సాధారణంగా బ్యాంక్ మూసేయాల్సిన పరిస్థితి వస్తే, బ్యాంక్ ను వేరే బ్యాంక్ తో కలుపుతారు.ముఖ్యంగా పీ.ఎస్.యూ బ్యాంకులలో ఇది సాధ్యపడుతుంది.అందువల్ల బ్యాంక్ లో డిపాజిట్ చేసే ముందు, బ్యాంక్ పరిస్థితి పరిశీలించడం మంచిది.వడ్డీ ఎక్కువ ఇస్తున్నారని అంతగా పేరు లేను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే తరువాత ఇబ్బంది రావచ్చు.మరో విషయం, డిపాజిటర్ల డబ్బుని కాపాడటానికి ఒక సంస్థ వుంది.డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గారెంటీ కార్పొరేషన్ (DICGC) అనే సంస్థ మన డిపాజిట్లకు ఇన్సూరెన్స్ వర్తింపజేస్తుంది.అయితే కేవలం లక్షరూపాయల వరకు మాత్రమే.అంటే, మీ డిపాజిట్ డబ్బులు గల్లంతైతే, DICGC లక్ష రూపాయల దాకా తిరిగి ఇస్తుంది.

నా పోర్ట్ ఫోలియో పంపించాను.మీరు దాన్ని విశ్లేషించి తగిన సలహా ఇస్తారా?


చాలా వివరంగా మీ ఆర్థిక స్థితిని, మీరు తీసుకున్న పథకాల గురించి పంపించారు.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి వుంది.మీ వయసు నలభైకి చేరువలో వుంది.హోమ్ లోన్, కార్ లోన్ నడుస్తున్నాయి.ఎమర్జెన్సీ కోసం డబ్బు తక్కువగా వుంది, బంగారం వుంది కాబట్టి ఫర్లేదు.ఇక మీరు నెల నెల కడుతున్న పథకాలు చూడండి.అన్నీ ఈక్విటీలోకే వెళ్తున్నాయి.నలభై దగ్గర్లోకి వచ్చాక కాస్త దూకుడు తగ్గించాలి.ఇక్విటీని క్రమంగా తగ్గించుకోని, డెట్ ఫండ్స్, డిపాజిట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి.పీపీయఫ్ గురించి కూడా ఆలోచించండి.ఇన్సూరెన్స్ పెంచుకోవాలి.మిగిలిన వివరాలు మీకు పంపిస్తున్నాను.

No comments:

Post a Comment