Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, October 18, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 17

మా మతాచారం ప్రకారం వడ్డీ తీసుకోవడం, ఇవ్వడం నిషిద్దం.అలాంటప్పుడు పెట్టుబడి ఎలా పెట్టగలం? – షావూల్ హమీద్, నెల్లూరు

షావూల్ గారూ, ఇస్లాం మతాచారం ప్రకారం వడ్డీ మాత్రమే నిషేదించబడింది.పెట్టుబడి కాదు.పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒక కంపెనీలో భాగస్వామి అవుతారు.ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది, షేర్ కొంటే లాభంలో వాటా వస్తుంది. రెండింటి తేడాని గుర్తించండి.ఇప్పుడు ఇస్లామిక్ ఫైనాన్స్ అని, ఇస్లామిక్ బ్యాంకింగ్ అని ప్రపంచవ్యాప్తంగా, ఇస్లాం మతాచారం ప్రకారమే పెట్టుబడి పెట్టే అవకాశాలు చాలా వచ్చాయి.వాటి గురించి తెలుసుకోని, మీకు సమ్మతమైతే ప్రకారం చెయ్యండి.

ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను.సంవత్సరం సంవత్సరం జీతం పెరుగుతోంది.ప్రతి సారీ, సంవత్సరం నుంచి ఆదా చెయ్యాలనుకుంటున్నాను.కానీ ఒక్క సంవత్సరం కూడా అనుకున్నంత ఆదా చెయ్యలేకపోతున్నాను. వస్తున్న డబ్బంతా ఏమైపోతోందో తెలియడం లేదు..

వస్తున్న డబ్బు ఏమైపోతోందో అన్న ఆందోళన అవసరం లేదు.దానికి చాలా సులభమైన జవాబు వుంది.మీ డబ్బు ఖర్చైపోతోంది. ఖర్చుని అదుపు చేసి, ఆదా చెయ్యాలనుకుంటే కొంత శ్రమపడాలి.ముందు మీరు పెడుతున్న ఖర్చులో అప్పులు తీర్చడానికి ఎంత వెళుతోందో గ్రహించండి.క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ లాంటివి వుంటే, మీకు తెలియకుండానే మీ జీతాన్ని అవి మింగేస్తాయి.ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ వాడుతుంటే, వెంటనే దాన్ని నిలిపివేయండి.అన్ని అప్పులకు మీరు కడుతున్న ఈఎంఐ మొత్తం కలిపి, మీ జీతంలో నలభై శాతం కన్నా ఎక్కువ వుండకూడదు.మిగిలిన ఖర్చులలో ఎంత విధమైన ఖర్చులకు వాడుతున్నారో గమనించుకోండి.వీలైతే ఒక మూడు నెలల పాటు ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి లెక్క రాయండి.మూడు నెలల తరువాత, ఖర్చులని మీరే సమీక్షించుకుంటే, అనవసరమైన ఖర్చులేమిటో మీకే తెలిసిపోతాయి.వాటిని అదుపు చేసే ప్రయత్నం మొదలుపెట్టండి.

నేను పని చేస్తున్న కంపెనీలో ఆరోగ్య బీమా వుంది.కుటుంబం మొత్తానికి కవర్ ఇస్తున్నారు. నేను మరో ఆరోగ్య బీమా తీసుకోవాలా ?

తప్పకుండా తీసుకోవాలి.కంపెనీ ఇచ్చే ఆరోగ్య బీమా వల్ల రెండు ఉపయోగాలు వున్నాయి.ఇది గ్రూప్ పాలసీ కాబట్టి తక్కువ ప్రీమియంకి లభిస్తుంది.అలాగే కుటుంబ సభ్యులందరికీ ఇచ్చే పాలసీ కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు (తల్లి తండ్రి వగైరా) వుంటే, వాళ్ళకు చాలా చౌకగా బీమా సమకూరుతుంది.అయితే, అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోతే ఏమౌతుంది?సరిగ్గా అప్పుడే ఆరోగ్య సమస్య ఎదైనా వస్తే ఖర్చు తట్టుకోగలరా?ఇవన్నీ ఆలోచించుకోవాలి.కంపెనీ పాలసీ వున్నా, స్వంతంగా ఒక పాలసీ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు వున్నాయి.విపత్కర ఆరోగ్య పరిస్థితిలో కంపెనీ పాలసీ లేకపోయినా పాలసీ వల్ల ఊరట కలుగుతుంది.ఉద్యోగం వచ్చినప్పటి నుంచే బీమా తీసుకుంటే క్లైములు వచ్చే అవకాశం తక్కువ కాబట్టి ప్రీమియం తగ్గుతూ వస్తుంది.సెక్షన్ 80D కింద టాక్స్ మినహాయింపు కూడా వస్తుంది.వీలైతే, హాస్పిటల్ బిల్ తో సంబంధం లేకుండా కేవలం హాస్పిటలైజేషన్ కే క్లైయిమ్ ఇచ్చే పథకాలలో చేరండి.

నేను, మా వారు ఉద్యోగం చేస్తున్నాం. ఇద్దరం సంపాదిస్తున్నా అప్పు లేకుండా గడవటం లేదు


అప్పు చేయటం తప్పు కాదు.ఎంతటివారికైనా అప్పు చెయ్యక తప్పదు.కాకపోతే అప్పు తీసుకున్న డబ్బుని ఏం చేస్తున్నారు? అప్పు తీర్చడానికి ఎలాంటి పథకం అవలంబిస్తున్నారు అనేవి గమనించుకోవాలి.కేవలం సరదాల కోసం, లైఫ్ స్టైల్ కోసం అప్పులు చేస్తే రెండు కాదు నాలుగు జీతాలు వున్నా సరిపోవు.ఎలాగూ ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరి జీతం తక్కువగా వుంటే జీతాన్ని ఖర్చులకోసం వాడుతూ మిగిలినది ఆదా చేయగలరేమో ప్రయత్నించండి.వుండేవి రెండు జీతాలని అనుకోవడం మానేయండి.ఒకటే జీతం మీద బతకడానికి ప్రయత్నించండి.

No comments:

Post a Comment