ఇన్సూరెన్స్
పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను.ఏ
పాలసీ బాగుందో
చెప్తారా?
ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటున్నారు?లైఫ్ కవరేజ్ కోసమా?పెట్టుబడి పెట్టడం కోసమా?టాక్స్ తప్పించుకోడానికా?గతంలో ఇన్సూరెన్స్ గురించి చెప్తూ కేవలం లైప్జ్ కవర్ వున్న పథకాలు (టర్మ్ పాలసీలు) మాత్రమే తీసుకోవాలని సూచించాను.మీకు కూడా లైఫ్ కవరే కావాలని అనుకుంటున్నాను.అన్నింటికన్నా చౌకైన లైఫ్ టర్మ పాలసీలు ఏజంటు ద్వారా లభించవు.ఆన్ లైన్ ద్వారా కొనుక్కోవాలి.వివిధ కంపెనీల రకరకాల పాలసీ వివరాలు కొన్ని వెబ్ సైట్లలో దొరుకుతాయి. వీటి ఆధారంగా మీకు నచ్చిన పాలసీ వెతుక్కోండి
మన
కుటుంబాలలో డబ్బు
గురించి అంతగా
ఎందుకు మాట్లాడుకోరు?చిన్నప్పటి
నుంచే డబ్బు
గురించి ఇలాంటి
పాఠాలు చెప్తే
పిల్లలు పెద్దయ్యాక
డబ్బు విషయంలో
ఇంకాస్త తెలివిగా
ప్రవర్తించే అవకాశం
వుంది కదా?
డబ్బు అంటే అంటరానిది అన్నట్లు రహస్యంగా వుంచడం మన సమాజంలో వుంది.మగవాడి జీతం ఎంతో అడగకూడదని ఒక సామెత కూడా వుంది.కారణాలు వెతకడం అనవసరం.కానీ, డబ్బు గురించి తెలిసిన విషయాలను కుటుంబసభ్యులకు చెప్పడం అవసరం.ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఇన్సూరెన్స్ వంటి వివరాలు తప్పకుండా తెలిసివుండాలి.అలాగే పిల్లలతో డబ్బు గురించి అప్పుడప్పుడు మాట్లాడాలి.డబ్బులు సంపాదించడం గురించి, ఆదా చేయడం గురించి నేర్పించాలి. మీరు చెప్పినట్లు, అలా
చేయడం
వల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక డబ్బు విషయంలో జాగ్రత్తగా వుండటమే కాదు, త్వరగా సంపద సాధించగలుగుతారు కూడా.
ఇవన్నీ
చదువుతుంటే చాలా
బాగున్నాయని అనిపిస్తుంది.కానీ
వీటిని అవలంబించాలంటే
ఆఊపు రావటం
లేదు.ఎందుకంటారు? (అభిమాని,
ఈమెయిల్ ద్వారా)
చదివినదంతా ఒకేసారి చేసేయాలని అనుకోకండి.బేతాళ కథలలో నేను దాదాపు నలభైపై ఆలోచనలను మీతో పంచుకున్నాను.అవన్నీ ఒకేసారి అవలంబించే అవకాశం ఎవరికో కానీ వుండదు.అందులో మీకు సరిపోయే రెండో మూడో ఎన్నుకోని కనీసం మూడు నెలలు పాటించండి.ముఖ్యంగా అప్పులు వుంటే వాటిని తగ్గించుకునేవి, ఖర్చులు తగ్గించేవి ఎన్నుకోండి.మీరు చెయ్యాలనుకుంటున్న ఆలోచన మీ కుటుంబసభ్యులతో ముఖ్యంగా (వుంటే) జీవిత భాగస్వామితో, మిత్రులతో పంచుకోండి.ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్ళండి.ఖర్చులు తగ్గు ముఖం పట్టాగానే ఆదాయం, పొదుపు పెంచుకుంటూ వెళ్ళండి.జయీభవ.
ఫైనాన్షియల్
ప్లానింగ్ గురించి
చెప్పేటప్పుడు చాలా
చోట్ల ఇన్సూరెన్స్
తప్పకుండా తీసుకోవాలని
చెప్తారు?ఎలా
ఎందుకు అంటారు?ఇన్సూరెన్స్
తీసుకోకుండా ఆ
డబ్బుని ఇన్వస్ట్
చేసి ఇన్సూరెన్స్
కన్నా ఎక్కువ
సంపాదిస్తే, ఇన్సూరెన్స్
తో పని
వుండదు కదా?
మీరు చెప్పింది నిజమే.ఆర్థిక ప్రణాలికలో అన్నింటికన్నా ముందు ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తారు.ఎందుకంటే అనుకోకుండే మరణం సంభవిస్తే, ఆ వ్యక్తి కుటుంబం కోసం వేసుకున్న ప్రణాలిక అమలు కాదు కాబట్టి.కూతురి పెళ్ళి కోసం పొదుపు చేస్తూ ఒక వ్యక్తి చనిపోయాడనుకుందాం.ఇప్పుడు ఆ కూతురి పెళ్ళికి డబ్బులు ఎలా వస్తాయి?ఇన్సూరెన్స్ వుంటే, ఆ క్లెయిమ్ డబ్బులు అతను అనుకున్న కుటుంబ అవసరాలకు పనికొస్తాయి.అంటే ఒక వ్యక్తి తను లేకపోతే, కుటుంబానికి ఎంత సొమ్ము అవసరం అవుతుందో, అంతకు సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి.ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్న. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక సూత్రం అవలంబించాలి.“కుటుంబానికి అవసరమయ్యే డబ్బు + అప్పటి వరకు చేసిన అప్పులు – సంపాదించిన ఆస్థులు” ఇది ఫార్ములా.ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్థి మొత్తం, కుటుంబానికి అవసరమ్మే డబ్బు, అప్పులు తీర్చడానికి అవసరమయ్యే డబ్బు కన్నా ఎక్కువ వుంటే ఇక ఇన్సూరెన్స్ తో పనేముంది?అంటే ఒకరకంగా, మీరు లేనప్పుడు అవసరాలకు ఆస్థుల్ని అమ్ముకోమని సలహా ఇచ్చినట్లే.అంటే ఇల్లు, కారు వంటివి వదిలి, షేర్లు, బంగారం, భూములు కలిపి కుటుంబానికి సరిపోయేంత వుంటే ఇన్సూరెన్స్ తీసుకోకుండా మానుకోవచ్చు.
Your suggestions very fine...thank u sir
ReplyDelete