Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, October 4, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 15

మధ్యే ఇంజనీరింగ్ పూర్తి చేసుకోని ఉద్యోగంలో చేరాను.మొదటి ఉద్యోగం.డబ్బులు, ఆర్థిక ప్రణాలికలు, పెట్టుబడుల గురించి బొత్తిగా తెలియదు.నేను ఏం చెయ్యాలి?

అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా?లేక అర్థంకావని వదిలేశారా?చాలా సులభమైన సూత్రాలతో ఆర్థిక ప్రణాలికలు వేసుకోవచ్చు.మీ చేతిలోకి వచ్చే డబ్బు పెరిగాలా చూసుకోండి.మీ చేతి నుంచి ఖర్చైపోయే డబ్బు తగ్గేలా చూసుకోండి.దాచుకునే డబ్బు అన్ని రకాల పథకాలలో వుండేలా చూసుకోండి.వయసుని బట్టి ఈక్విటీ పథకాలలో తప్పకుండా డబ్బులు పెట్టండి.మీకు తెలియని పథకాలు కొనకండి.వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి.ఏడాదికి ఒకసారైనా మీ ఆర్థిక స్థితిని సమీక్షించుకోండి.ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్.గతంలో రాసిన రూపాయి చెప్పిన బేతాళ కథలలో నలభై వారాలు వీటన్నింటి గురించి చెప్పాను.అవకాశం వుంటే వాటిని చదవండి.

బంగారం మంచి పెట్టుబడే కదా?

బంగారం మంచి పెట్టుబడే కానీ కేవలం బంగారం మీదే పెట్టుబడి పెట్టడం తప్పు.మీ పొదుపు మొత్తంలో పది శాతానికి మించి బంగారం కొనకండి.మరీ ముఖ్యంగా నగలు కొని, దాన్ని పెట్టుబడి అనుకోకండి.అది కేవలం ఖర్చు మాత్రమే అని గుర్తించండి.

రెండేళ్ళ క్రితం కొంత భూమి అమ్మితే బాగా డబ్బులు వచ్చాయి. డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చెయ్యడానికి వెళ్తే వాళ్ళు కొన్ని పథకాలు చెప్పి వాటిలో పెట్టుబడి పెట్టించారు.ఇప్పుడు చూస్తే వాటిలో డబ్బు అంతగా పెరగలేదు.ఇప్పుడేం చెయ్యమంటారు?

ఇప్పుడు మీరు చెయ్యగలిగింది దాదాపు ఏమీ లేదు.ఆర్థిక విషయాలలో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఎవరి సలహా పాటించకపోవడమే మంచిది.ఎవరికి వారు ఆర్థిక పథకాల గురించి అవగాహన పెంచుకోని వారి వయసు, సంపాదన, నష్టాన్ని తట్టుకునే సామర్థ్యం ఆథారంగా పెట్టుబడి పెట్టాలి.కానీ చాలా మంది బ్యాంకు ఉద్యోగి, ఇన్సూరెన్స్ ఏజెంట్, బంధువో స్నేహితుడో చెప్పిన సలహాలపైన ఆధారపడతారు.బ్యాంకులో పని చేస్తున్నంత మాత్రాన అతనికి ఆర్థిక పథకాల గురించి పూర్తి అవగాహన వుంటుందని చెప్పలేము.ఒకవేళ వున్నా, అతని ఉద్యోగరీత్యా ఇంక్రిమెంట్లకి, బోనస్ లకి ఉపయోగపడే పథకాన్ని అమ్ముతాడే తప్ప మీకు అవసరమైన పథకాన్ని అమ్ముతాడాని చెప్పలేము.ఏది ఏమైనా మీరు తీసేసుకున్నారు.ఇప్పుడు అమ్మిన వాళ్ళని అని ప్రయోజనం వుండదు.నాకు తెలిసి బ్యాంక్ ఉద్యోగి మీకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ అమ్మి వుంటాడు.వీటికి లాకిన్ పిరియడ్ వుంటుంది.అది ఎంతో తెలుసుకోండి.అది అయిపోగానే డబ్బులు వెనక్కి తీసుకోని మీకు సరిపోయే పథకాలలో పెట్టుబడి పెట్టండి.

బేతాళ కథల్లో మీరు ఒక మాట అన్నారు.మనం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరో వైపు లక్షల జీతాలు తీసుకుంటున్న మార్కెటింగ్ నిపుణులు మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటున్నారని చెప్పారు.ఇది నిజమేనంటారా?


మార్కెటింగ్ అనే విభాగం వున్నదే అందుకు.ఒక సంస్థ ఏదైనా ఉత్పాదన మొదలుపెడితే అది మనం కొనుక్కునేలా చేసేదే మార్కెటింగ్ విభాగం.వీళ్ళ దృష్టి సర్వవ్యాప్తమై వుంటుంది.మన అవసరానికి ఫలానా ప్రాడక్ట్ మాత్రమే సరిపోతుంది అంటారు.అసలు మన మనసులో లేని అవసరాన్ని సృష్టించి మన మనసులోనే ప్రవేశపెడతారు.మనం ఎప్పుడు ఎక్కడ ఏం కొంటామో వీళ్ళకు తెలుసు.ఒక ఉదాహరణ చెప్తాను.మీరు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తారు.అక్కడ మీకు కావాల్సినవి కొనుక్కోని బిల్ వేయిస్తారు.షాప్ వారు మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు.మీరు బిల్ కట్టేసి ఇంటికి వస్తారు.ఇలా కొన్ని నెలలు గడుస్తుంది.ఇప్పుడు సూపర్ మార్కెట్ వాళ్ళు మీ పేరు/మొబైల్ నెంబర్ ఆధారంగా మీరు ఎప్పుడు ఏం కొంటున్నారో పరిశీలిస్తారు.బాసుమతి బియ్యం కొన్నప్పుడల్లా మీరు కూల్ డ్రింక్ కొంటున్నారని పరిశీలనలో తేలిందనుకోండి.అప్పుడు కిలో బాసుమతి కొంటే ఒక కూల్ డ్రింక్ ఉచితం లాంటి పథకాలు పెడతారు.ఇదంతా మీకు తెలియదు.సరిగ్గా మన అవసరానికి తగ్గట్టే స్కీమ్ వచ్చిందని సంతోషంగా రెండు ప్యాకెట్లు కొంటారు. ఉదాహరణ మీకు మాత్రమే సంబంధించినది.ఇలాంటి పరిశీలన కొన్ని వేల మంది వినియోగదారుల, వందలాది బిల్లుల మీద జరుపుతారు.వాటి ఆధారంగా అమ్మకాలు జరుపుతారు.ఇంత తతంగం వుంది కాబట్టి ఇదంతా మాయాజాలం అన్నాను.ఇలాంటి ప్రయత్నాలు జరిగితున్నాయి అని అవగాహన కలిగి వుండటమే వీటి నుంచి తప్పించుకోడానికి మార్గం.

No comments:

Post a Comment