పదిహేనేళ్ళ
క్రితం కొన్నఇల్లు.ఇప్పుడు
మంచి ధర
వస్తోందని అమ్మేశాను.నా
స్నేహితుడు దాని
మీద టాక్స్
కట్టాలని అంటున్నాడు.అది
నిజమేనా?
నిజమే.మూడేళ్ళకు పైగా ఇల్లు, భూమి వంటివి మీ పేరు మీద వుంటే వాటిని దీర్ఘకాలిక ఆస్థులుగా పరిగణిస్తారు.షేర్ల విషయంలో సంవత్సరం పాటు మీదగ్గరున్న షేర్లను దీర్ఘకాలిక ఆస్థులుగా పరిగణిస్తారు.ఇలాంటి దీర్ఘకాలిక ఆస్థుల్ని అమ్మినప్పుడు వాటి మీద వచ్చేలాభాన్ని కాపిటల్ గెయిన్స్ (Capital Gains).చట్టాప్రకారం వీటి మీద టాక్స్ కట్టాలి.అయితే ఇంటి విషయంలో కొన్ని మినహాయింపులు వున్నాయి.ఒక ఇల్లు అమ్మిన మూడేళ్ళలో మరో ఇల్లు కట్టించినా, సంవత్సరం క్రితం కానీ, రెండేళ్ళలోపు కానీ ఇల్లు కొన్నా, ఈ టాక్స్ వర్తించదు.మిగిలిన ఆస్థుల అమ్మకాలకి, ఒకొక్క ఆస్థికి ఒకో రకమైన టాక్స్ ట్రీట్మెంట్ వుంది.వాటిని ఎవరైనా ఛార్టెడ్ ఎకౌంటెంట్ ని అడిగి తెలుసుకోవచ్చు.కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తప్ప మిగిలినవి ఈ టాక్స్ పరిథిలోకి రావు.
ఇంటి
రుణం తీసుకున్నప్పుడు
వీలైనంత ఎక్కువ
కాలం వ్యవధి
వుండేలా తీసుకోమంటారు
అది కరెక్టేనా?
ప్రస్తుతం ఇంటి రుణం 9.5% వడ్డీకే దొరుకుతోంది.పైగా ఇంటి రుణం తీర్చే సొమ్ముకు పన్ను రాయితీ కూడా వుంది.ఆ రకంగా చూస్తే ఇంటి రుణం చాలా చవకైన రుణం.అందుకని ఎక్కువ కాలవ్యవధి పెట్టుకోమని చాలామంది సలహా ఇస్తారు.అయితే ఆ నిర్ణయం వయసుని బట్టి కూడా వుంటుంది.ఇరవైల్లో గృహరుణం తీసుకుంటే ముఫై ఏళ్ళ వ్యవధి పెట్టుకోవచ్చి.నలభైల్లో తీసుకుంటే పదేళ్ళకన్నా ఎక్కువ కాల వ్యవధి వుండకూడదు.
నేను
నాలుగేళ్ళ క్రితం
రిటైర్ అయ్యాను.నా
రిటైర్మెంట్ డబ్బులో
పన్నెండు లక్షలు
బ్యాంక్ ద్వారా
యూనిట్ లింక్డ్
ఇన్సూరెన్స్ పథకాలలో,
మ్యూచువల్ ఫండ్లో
పెట్టాను.ఇప్పుడు
వాటి విలువ
పది లక్షలు
దాటలేదు.రెండు
లక్షలు పోగొట్టుకున్నాను.ఇప్పుడేమి
చెయ్యాలి?
చేతులు కాలిన తరువాత ఏం చెయ్యగలం?బ్యాంక్ ద్వారా చాలామంది ఇలాంటి పథకాలలో పెట్టి మోసపోయారు.కేవలం బ్యాంక్ మీద/ బ్యాంక్ ఉద్యోగి మీద నమ్మకంతో ఇలాంటి పథకాలలో డబ్బులు పెట్టారు.ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఉద్యోగి అమ్మినంత మాత్రాన అది మీకు సరిపోయే పథకం అని నమ్మకండి.అలాంటి ఉద్యోగులు తమ తమ టార్గెట్ కోసం అమ్ముతారు.వాళ్ళ టార్గెట్ లో ఇన్సూరెన్స్ ఎక్కువ వుంటే ఇన్సూరెన్స్ అమ్ముతారు, మ్యూచువల్ ఫండ్స్ వుంటే మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతారు.మీ విషయానికి వస్తే – మీ మొత్తం ఆస్థి ఆదాయం వివరాలు ఇవ్వలేదు.వాటి ఆధారంగా ప్లానింగ్ చెయ్యాలి.పెద్దగా ఆస్థులు లేవని, పెన్షన్ తప్ప వేరే ఆదాయం లేదని అనుకుంటున్నాను.మీరు పెట్టుబడి పెట్టిన పథకాలలో ఎక్కువ శాతం మూడేళ్ళ లాకిన్ వుండి వుంటాయి.మీరు పెట్టుబడి పెట్టి మూడేళ్ళు అయ్యింది కాబట్టి వాటిని వెనక్కి తీసుకునే అవకాశం వుంది.ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బాగా ఒడిదుడుకులలో వుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా, సమయం చూసి విత్ డ్రా చేసేయండి.వచ్చిన డబ్బుతో మీ కోసం ఆరోగ్య బీమా తీసుకోండి.కొంత లిక్విడ్ రూపంలో అందుబాటులో వుంచుకోండి.మిగిలిన సొమ్ముని డిపాజిట్లలో పెట్టుకోండి.అన్నట్టు మీ డబ్బు మొత్తం వెనక్కి తీసుకోనవసరం లేదు.ఒక లక్షో, లక్షన్నరో మ్యూచువల్ ఫండ్ లోనే వుంచేయండి.
వ్యవసాయం
కోసం బ్యాంక్
రుణం తీసుకున్నాను.అనుకున్నట్లు
వర్షాలు లేవు.
రుణ మాఫీ
వస్తుందేమోనని..
రుణ మాఫీలు రాజకీయానికి సంబంధించినవి.జరగచ్చు జరగకపోవచ్చు. వస్తుందో రాదో తెలియని రుణమాఫీ
కోసం
ఇపుడు వాయిదాలు కట్టకపోతే అసలుకే మోసం రావచ్చు. పొలం,ఇల్లు జప్తు కావటం వంటివి జరగచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంకు మిమ్మల్ని ఎగవేతదారుడిగా భావించి ముందు ముందు లోన్లు ఇవ్వకపోవచ్చు.అందువల్ల అప్పు ఒకసారి తీసుకున్న తరువాత ఎగవేద్దాం అన్న ఆలోచనే రాకూడదు.
No comments:
Post a Comment