మా
పిల్లలు బాగానే
బాగానే బతుకుతున్నారు.నాకు
జీతం, మా
వారికి పెన్షన్
పెద్ద మొత్తంలోనే
వస్తాయి.ఆ
రెండింటిలో ఏదో
ఒకటి మాకిచ్చేయమని
పిల్లలు అడుగుతున్నారు.వాళ్ళకు
మేము ఒక
ఆదాయాన్ని ఇవ్వాలా?వద్దా?దాచిపెట్టి
చివర్లో ఇస్తే
మంచిదా?అసలు
ఇవ్వకుండా దానధర్మాలు
చేయ్యాలా? – భారతి,
రామన్నపాళెం
ఒక్కమాటలో చెప్పాలంటే మీ డబ్బు, మీ ఇష్టం.ఇందులో మరొకరి ప్రమేయమే అవసరం లేదు.మీ జీతాన్ని ఏం చెయ్యాలనుకుంటే అది చేసుకోవచ్చు.అందుకు మీ ఆయన కూడా అభ్యంతరపెట్టడానికి లేదు.కాకపోతే, ఇద్దరూ కలిసి సంసారాన్ని నడపాలి కాబట్టి సంప్రదించుకోవడం అవసరం.ఇక పిల్లలు అంటారా?వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి వుండకపోతే అప్పుడు మీరు సహాయం చెయ్యచ్చు.అది బాధ్యత.వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, మీ సహాయన్ని ఆశించడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఇవ్వాల్సి వస్తే బయట బ్యాంకు రేటు కన్నా తక్కువ వడ్డీతో
నెల
నెలా ఈయంఐ రూపంలో తిరిగి ఇచ్చే ఒప్పందం మీద ఇవ్వండి. పిల్లలు అప్పు చెయ్యక తప్పనప్పుడు, బయట వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి మీరు ఇవ్వడం ద్వారా సహాయం చేసినట్లే అవుతుంది.ఆ డబ్బు పైన వాళ్ళకి బాధ్యత వుండేలా చేస్తుంది.రేపెప్పుడో అన్నం పెడతారని ఈ రోజు డబ్బులు ధారపోయడం అవివేకం.ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకుంటే రేపు అవే మీకు అన్నం పెడతాయి.మీకు ముందు ముందు అవసరాలకు సరిపోయేలా డబ్బు దాచుకోని మిగిలిన డబ్బు వాడుకోండి.యాత్రలకు వెళ్ళండి.దానధర్మం చేయండి.అయితే పూర్తిగా పిల్లల్ని కాదని ఇంకెవరికో పెట్టడం కూడా మంచిది కాదు కాబట్టి కొంత పిల్లలకు కూడా మిగిలేలా ప్లాన్ చేసుకోండి.
కొన్ని
కంపెనీలు వడ్డీ
లేకుండా రుణాలు
ఇస్తున్నాయి.వీటిని
నమ్మచ్చా?
ప్రపంచంలో ఏ సంస్థ లాభం లేకుండా పని చెయ్యదు.ఇది అన్నింటికి మూలమైన సూత్రం.కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ముఖ్యంగా వైట్ గూడ్స్ అంటే టీవీ, వాషింగ్ మెషీన్ వగైరా వస్తువుల పైన 0% వడ్డీతో ఫైనాన్స్ సదుపాయం ఇస్తామని చెప్తాయి.నెల నెలా ఈయంఐ చూస్తే కూడా అంతే వుంటుంది.కానీ అసలు తిరకాసు వేరే వుంది.అది ప్రాససింగ్ ఫీజ్.మీరు తీసుకునే లోన్ మొత్తం పైన కొంత శాతం ప్రాససెంగ్ ఫీజుగా తీసుకుంటారు.ఇది 2 నుంచి 5 శాతం దాకా వుంటుంది.ఇది కాక ఇలాంటి వస్తువుల పైన మీకు ఇచ్చే డిస్కౌంట్ ఏదన్నా వుంటే అది మీకు లభించదు.ఉదాహరణకి యాభై వేలు ఖరీదు చేసే టీవీ కొంటే, మీకు లభించే రెండు వేల డిస్కౌంట్ మీకు ఇవ్వరు.ఒక వెయ్యి రూపాయల దాకా ప్రాసెసింగ్ ఫీజు. అంటే మీకు నలభై ఎనిమిది వేలకు దొరకే టీవీని
యాభై
ఒక్క వేలకి కొంటారు. అడ్వాన్స్ ఈఎంఐ వుంటే దాని వడ్డీ అదనం.అయితే ఇలా కట్టే డబ్బు మొత్తాన్ని వడ్డీగా లెక్కేస్తే, క్రిడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ కన్నా తక్కువ వడ్డీనే పడుతుంది.అందువల్ల అప్పుచేసి కొనాలనుకున్నవాళ్ళకి ఈ పథకం మంచిదే.
బేతాళా!
చాలా వరకు
ప్రశ్నలలో మీరు
మ్యూచువల్ ఫండ్స్
లో డబ్బులు
పెట్టమని సలహా
ఇస్తున్నారు.దాని
బదులు నేరుగా
షేర్లే కొనుక్కోవచ్చు
కదా?
నిజమే.ఏదో ఒక రూపంలో ఈక్విటీలో డబ్బులు పెట్టకుండా సంపద సాధించడం దాదాపు అసాధ్యం.అలా పెట్టేందుకు రెండు రకాల మార్గాలు వున్నాయి.మ్యూచువల్ ఫండ్ లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ విధానంలో ఏదైనా ఫండ్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ఒక పద్ధతి.నేరుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం. నేరుగా షేర్లు కొనుక్కోడానికి వాటి గురించి పరిజ్ఞానం కావాలి, రకరకాల షేర్లు కొనుక్కోడానికి చాలా డబ్బు కావాలి, అవసరమైనప్పుడు/పెట్టుబడి విలువ పెరిగినప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసుకోకుండా నియంత్రణ కావాలి. మ్యూచువల్ ఫండ్ లో ఫండ్ మేనేజర్ అనే అనుభవజ్ఞుడు వుంటాడు, రకరకాల షేర్లు కొనేందుకు చాలామంది ఇచ్చిన డబ్బు వుంటుంది, లాకిన్ విధానం వల్ల వెనక్కి తీసుకునే అవకాశం వుండదు. అదీ సంగతి!
నేను
గత ఇరవై
ఏళ్ళుగా రకరకాల
పథకాలలో డబ్బు
పెట్టాను.దేవుడి
దయవల్ల బాగా
లాభపడ్డాను.ఇప్పుడు
నా కొడుకు
సంపాదిస్తున్నాడు.అతన్ని
కూడా నేను
డబ్బులు పెట్టిన
పథకాలలోనే పెట్టమని
సలహా ఇస్తున్నాను.ఈ
ఆలోచన కరెక్టేనా?
మీ ఆలోచన కరెక్ట్ కాదు.అన్నింటికీ ఒకే మత్రం పనిచెయ్యనట్లే, అందరికీ ఒకే స్ట్రాటజీ పని చెయ్యదు.ఒకరి విలాసవంతమైన ఖర్చు, మరొకరికి అవసరం కావచ్చు.కొంతమంది ఎంత నష్టం వచ్చినా కోలుకోగలరు.కొంతమంది ఏ మాత్రం నష్టం రాని సురక్షిత పథకాలనే ఎన్నుకుంటారు.ముఖ్యంగా పెట్టుబడి పెట్టే వ్యక్తి వయస్సు కూడా పెట్టుబడి వ్యూహాన్ని ప్రభావితం చేస్తుంది.వయసు తక్కువగా వున్నవాళ్ళు ఎక్కువ శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు ముఫై ఏళ్ళు వున్న వ్యక్తి పొదుపు చేసే మొత్తం డబ్బులో డెభై శాతం దాకా ఈక్విటీలో పెట్టచ్చు, అదే అరవై ఏళ్ళ వ్యక్తి తన పొదుపు మొత్తంలో నలభై శాతం కన్నా ఎక్కువ ఈక్విటీలో ఉంచకూడదు.
No comments:
Post a Comment