Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, September 13, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 12

ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం.ప్రతి నెల 11000 ఈపియఫ్ కడుతున్నాను.ఇంకా పదమూడు సంవత్సరాల సర్వీస్ వుంది.అప్పటికి సొమ్ము ఎంత వస్తుందో చెప్పగలరు…. మ్యూచువల్ ఫండ్స్ మంచివేనా?రాబడి వచ్చే ఫండ్స్ సూచించగలరు. (లహరి, చెల్పూర్)

లహరిగారు, మీరు కడుతున్న ఈపీయఫ్ కి మీరు పని చేస్తున్న సంస్థ నుంచి మేచింగ్ కాంట్రిబ్యూషన్ కూడా వస్తుంది.కాబట్టి మీరు నెలనెల కడుతున్న 11000తో పాటు, మరో 11000 వచ్చి జత చేరుతోంది.ప్రస్తుతం వున్న విధానాల ప్రకారం ఇది సుమారుగా మీ బేసిక్ + డిఏ లో 24% వుంటుంది. పథకం రిటైర్మెంట్ కోసం ఉద్దేశ్శించినది.ఎంత వస్తుంది అని చెప్పడం కష్టం.ప్రతి సంవత్సరం EPFO తమ వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది.ప్రస్తుతం 8.5% వడ్డీ ఇస్తున్నారు.అయితే ఇప్పటిదాకా మీరు దాచుకున్న ఈపీఎఫ్, సంస్థ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తో కలిపి ఎంతైందో తెలుసుకోడానికి మీరు ఏపీయఫ్ సంస్థ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు (www.epfindia.gov.in).వీలైనంతవరకు డబ్బును రిటైర్మెంట్ దాకా విత్ డ్రా చేయకుండా వుండటానికి ప్రయత్నించండి.ఇక మీ రెండో ప్రశ్న. ప్రత్యేకించి కొన్ని పథకాల గురించి విశ్లేషించడం, పథకంలో పెట్టుబడి పెట్టాలో చెప్పడం కుదరదు.గమనించండి.

మా అబ్బాయిని ఇంజనీర్ ని చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను.ఎంసెట్ రాంకు చూస్తే మంచి కాలేజిలో సీట్ దొరికేట్టు లేదు. అంత ఫీజులకోసం అప్పులు చెయ్యక తప్పేట్టు లేదు…  రవిశంకర్, నెల్లూరు

రవిశంకర్ గారు, మీ ప్రశ్న ఎలా మొదలైందో గమనించండి.“ఇంజనీర్ కావాలని మా అబ్బాయి కలఅని మొదలైవుంటే మీ సమస్యకు సలహా చెప్పేవాణ్ణి.ఒక చిన్న సూత్రం చెప్తాను గుర్తుపెట్టుకోండి.పిల్లలు తమకి ఇష్టమైన చదువులు చదవడానికి కష్టపడతారు.స్కాలర్ షిప్ తెచ్చుకుంటారు.మంచి కాలేజి వాళ్ళే వెతుక్కోని అక్కడ చేరడానికి శాయశక్తులా కృషి చేస్తారు.మీకు నచ్చిన చదువులు వాళ్ళు చదవాలనుకుంటే వాళ్ళకి ఎలాగూ కష్టం తప్పదు.మీకు ఆర్థికంగా కూడా భారంగా మారుతుంది.

పొదుపు ముదుపు గురించి చెప్పినట్లే కుదుపు గురించి కూడా ఆలోచించండి. ఏదో ఒకరోజు బుల్ గారు యాగంటి నందిలా రంకెవేస్తారేమో!            చాణుక్య, తాడేపల్లిగూడెం

స్టాక్ మార్కెట్ నంది రంకె వేస్తే మార్కెట్ సూచి పైకి లేస్తుంది.ఎలుగుబంటి అరిస్తే కిందకు జారుతుంది.అలాంటి ఎత్తుపల్లాల వల్ల కుదుపులు ప్రయాణంలోనైనా తప్పవు.కుదుపు తట్టుకునే శక్తి మనకుండాలి.రెండు కుదుపుని అదుపు చేసే షాక్ అబ్జార్బర్లు మన బండికి వుండాలి.అన్నిటికన్నా ముఖ్యంగా కుదుపులే తెలియని (సుదీర్ఘ) విమానయానం చేయాలి.

బ్యాంకులో 20 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే నెల నెల తీసుకుంటే ఎంత వస్తుంది?టాక్స్ ఎంత కట్టాలి?                         (.భాస్కర్, మహబూబాబాద్)


ఎంత వడ్డీ?మీరు సీనియర్ సిటిజనా కాదా?వడ్డీ నెలకి ఒకసారి లెక్కవేసే పథకం లోనా?లేక మూడు నెలలకి ఒకసారి లెక్కవేసి పద్ధతిలోనా?టాక్స్ విషయానికి వస్తే ప్రస్తుతం మీ ఆదాయం ఎంతుంది?ఇవన్నీ తెలియాలి.స్థూలంగా చెప్పాలంటే ఇరవై లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి సుమారు ఇరవై వేలు రావచ్చు.కానీ నాకు ఇంకో అనుమానం.మీ దగ్గర ఇరవై లక్షలు వుంటే మొత్తాన్ని ఫిక్స్ డ్ దిపాజిట్ చెయ్యడం మంచిది కాదు.మీ వయసుని బట్టి కొంత ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, కొంత సేవింగ్స్ ఎకౌంట్ లో వుంచుకోండి.కొంత మ్యూచువల్ ఫండ్ ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి.మీ వయసు నలభై లోపు వుంటే నెల నెలా వడ్డీలా డబ్బులు తిరిగిచ్చే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని వున్నాయి (సిస్టమాటిక్ ఇన్కమ్ ప్లాన్) వాటిని పరిశీలించండి.

No comments:

Post a Comment